Home  »  TV News  »  'ఆలీతో సరదాగా' షోకి బ్రేక్!

Updated : Dec 15, 2022

ఈటీవీలో ప్రసారమవుతున్న "ఆలీతో సరదాగా" టాక్ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. ఐతే ఇప్పుడు ఈ షోకి బ్రేక్ పడబోతోంది అని ఆలీ తన షోలో చెప్పారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. 19 వ తేదీన ప్రసారమయ్యే ఈ షోలో ఆలీని ఇంటర్వ్యూ చేయడానికి సుమ కనకాల వచ్చింది. ఇక ఆలీకి పూల బొకే ఇచ్చి, షాల్ కప్పింది. "నేను మీకన్నా వయసులో చాలా చిన్నదాన్ని నన్ను ఆశీర్వదించండి" అని సుమ ఆలీ కాళ్ళ మీద పడి  ఆయన ఆశీర్వాదం తీసుకుంది.

"ఈరోజు ఆలీ గారిని అడగాల్సివన్నీ అడిగేసి కడిగేస్తా" అని ఒక రేంజ్ లో సీరియస్ గా చెప్పేసరికి దానికి  ఆలీ జోక్ గా "కడగడానికి వాటర్ తెచ్చావా అని అడిగారు.  వాటర్ మాత్రమే కాదు వేరేవి కూడా తెచ్చాను ఎందుకులెండి చెప్పడం" అంది సుమ   కూడా సరదాగా. ఇక ఆలీ మాట్లాడుతూ "ఈ షోని మొదట మంచు లక్ష్మితో స్టార్ట్ చేసాం..ఆమెకు మొదట థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అలా స్టార్ట్ ఐన ఈ షో 300 ప్లస్ ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఐతే ఇప్పుడు ఈ షోకి కొద్దిగా బ్రేక్ ఇస్తున్నాం. త్వరలో మరో అద్భుతమైన షోతో మీ ముందుకు వస్తాం" అని చెప్పారు ఆలీ.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.